ఒక దివ్వె ఉంటే అది వస్తువులను చూడదాని కుపయోగపడుతుంది. కాని చూడడానికి కన్నులు లేకుంటే దివ్వితో ఏమి పని? అంతా చీకటే. కన్ను లున్నప్పటికీ మనసు లేకపోతే ఆ కన్నులు చూడలేవు. మైకంవచ్చి కిందపడితే కన్నులు తెరచికొనియే ఉన్నా చూపు మాత్రం ఉండదు. అలాగే మనసు మాత్రం వున్నా చాలదు. ఆ మనసులో ఆత్మజ్యోతి అణగి ఉండాలి. ఆత్మజ్యోతిః ప్రసారము ఉన్నంతవరకే మనస్సు తలచినా కన్నులు చూచినా దివ్వె వెలుగున వస్తువులచే కనుగొన్నా దివ్వె వెలుగులో జడవస్తువులు కనబడతై. వీని కన్నిటికి మూలం ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతియే చైతన్యం. చైతన్యం ఒక్కటంటే ఒక్కటే.
- శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామి.
|